మసాలా వంకాయ కర్రీ

ABN , First Publish Date - 2019-10-12T16:35:18+05:30 IST

వంకాయలు - పావుకిలో(చిన్నసైజువి), నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - అర టీస్పూన్‌, మెంతులు - పావు టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉల్లిపాయ - ఒకటి, చింతపండు రసం - ఒక కప్పు, బెల్లం -

మసాలా వంకాయ కర్రీ

కావలసిన పదార్థాలు:
వంకాయలు - పావుకిలో(చిన్నసైజువి), నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - అర టీస్పూన్‌, మెంతులు - పావు టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉల్లిపాయ - ఒకటి, చింతపండు రసం - ఒక కప్పు, బెల్లం - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పసుపు - చిటికెడు, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - పావు టీస్పూన్‌, గరంమసాల - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత.
 
స్టఫింగ్‌ కోసం : నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము - అరకప్పు, వేరుసెనగలు - పావు కప్పు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత. (నువ్వులు, వేరుసెనగలు వేగించి అందులో ఎండు కొబ్బరి తురుము, కారం, ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి)
 
తయారీ విధానం:
వంకాయలను శుభ్రంగా కడిగి నువ్వులు, వేరుసెనగల పొడిని కూరాలి. ఒక పాన్‌లో నూనె వేసి స్టఫ్‌ను కూరిన వంకాయలు వేసి చిన్నమంటపై ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేగించాలి. కాసేపు వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి వేసి కలపాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న వంకాయలు వేయాలి. చింతపండు రసం, బెల్లం వేసి కలపాలి. చిన్నమంటపై కాసేపు ఉడికించాలి. చివరగా గరంమసాలా, కొత్తిమీర వేసి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి. చపాతీ, రోటీ, అన్నంలోకి మసాలా వంకాయ టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2019-10-12T16:35:18+05:30 IST