పనీర్‌ సల్సా టొర్టిల్లా..

ABN , First Publish Date - 2019-11-16T17:54:50+05:30 IST

కాటేజ్‌ చీజ్‌ - 150 గ్రాములు, జీలకర్ర - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, కారం - అర టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, పసుపు - అర టీస్పూన్‌; పచ్చిమిర్చి - నాలుగు

పనీర్‌ సల్సా టొర్టిల్లా..

కావలసిన పదార్థాలు:
కాటేజ్‌ చీజ్‌ - 150 గ్రాములు, జీలకర్ర - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, కారం - అర టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, పసుపు - అర టీస్పూన్‌; పచ్చిమిర్చి - నాలుగు, ఆలివ్‌ ఆయిల్‌ - 20 గ్రాములు, నిమ్మకాయ - ఒకటి, టొమాటో - ఒకటి, కీరదోస - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, ముల్లంగి - ఒకటి, టొర్టిల్లా - ఒకటి, పెరుగు - 400 ఎం.ఎంల్‌, ఉప్పు - రుచికి తగినంత, పుదీనా ఆకులు - కొద్దిగా, చాట్‌ మసాలా - రుచికి సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా జీలకర్రను వేగించి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, తగినంత ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్రపొడి, కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఇప్పుడు కాటేజ్‌ చీజ్‌ని ముక్కలుగా కట్‌ చేసుకుని మిశ్రమంలో వేయాలి. చీజ్‌ ముక్కలకు మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. తరువాత టొమాటో, కీరదోస, ఉల్లిపాయ, ముల్లంగిలను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌, తగినంత ఉప్పు, నిమ్మరసం, చాట్‌ మసాలా, పుదీనా ఆకులు వేసి కలిపి సల్సా తయారు చేసుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేసి కాస్త వేడి అయ్యాక చీజ్‌ ముక్కలు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. మరి కాస్త ఆలివ్‌ ఆయిల్‌ వేసి టొర్టిల్లాలు వేసి కాల్చాలి. తరువాత ఆ టొర్టిల్లాలో చీజ్‌ ముక్కలు, సల్సా వేసి రోల్‌ చేసుకుని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-16T17:54:50+05:30 IST