బనానా జామ్‌ కేక్‌

ABN , First Publish Date - 2019-12-21T18:58:35+05:30 IST

అరటిపండ్లు - మూడు, కోడిగుడ్లు - మూడు, నూనె - అరకప్పు, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ - పావుకప్పు, పంచదార - కప్పు,

బనానా జామ్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: అరటిపండ్లు - మూడు, కోడిగుడ్లు - మూడు, నూనె - అరకప్పు, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ - పావుకప్పు, పంచదార - కప్పు, గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ సోడా - ఒక టీస్పూన్‌, వెనీలా ఎసెన్స్‌ - ఒక టీస్పూన్‌.
 
తయారీ విధానం: ఒక పాత్రలో పిండి తీసుకొని కొద్దిగా బేకింగ్‌ సోడా వేసి కలిపి పక్కన పెట్టాలి. మరొక పాత్రలో పంచదార, నూనె, జామ్‌ వేసి కలపాలి. అరటిపండ్లను గుజ్జుగా చేసి వేయాలి. బ్లెండర్‌తో కలిపి ప్యూరీ తయారు చేసుకోవాలి. కోడిగుడ్లు, వెనీలా ఎసెన్స్‌ను బ్లెండ్‌ చేసి పక్కన పెట్టుకున్న పిండిలో వేసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. టిన్‌కు నూనె రాసి ఈ మిశ్రమం వేయాలి. ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద 25-30 నిమిషాలు బేక్‌ చేయాలి.

Updated Date - 2019-12-21T18:58:35+05:30 IST