సోయాబీన్‌తో పరాటాలు

ABN , First Publish Date - 2015-09-02T22:13:03+05:30 IST

కావలసిన పదార్థాలు: సోయా గ్రాన్యూవల్స్‌ - 3/4 కప్పు, ఉల్లిపాయ - 1, టమోటా - 1, పసుపు - చిటికెడు

సోయాబీన్‌తో పరాటాలు

కావలసిన పదార్థాలు: సోయా గ్రాన్యూవల్స్‌ - 3/4 కప్పు, ఉల్లిపాయ - 1, టమోటా - 1, పసుపు - చిటికెడు, కారం, గరం మసాల - 1 టీ స్పూను చొప్పున, దనియాల పొడి - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, సోంపు - 1 టీ స్పూను, గోధుమపిండి - 1 కప్పు.
తయారుచేసే విధానం: గోధుమపిండిలో గోరువెచ్చని నీరు, 1 టేబుల్‌ స్పూను నూనె, చిటికెడు ఉప్పు కలిపి మెత్తగా చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. నూనెలో సోంపు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా తరుగు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఆ తర్వాత కారం, గరం మసాల, దనియాలపొడి, పసుపులతో పాటు (గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు నానబెట్టి, నీరు పిండిన) సోయా గ్రాన్యూవల్స్‌ కూడా వేసి పావు కప్పు నీరు పోసి మూత పెట్టాలి. నీరు ఇగిరి ‘కీమా’మాదిరి పొడిపొడిగా అయ్యాక కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూరని చపాతీ మధ్య కొద్దిగా పెట్టి అన్ని వైపులా మడిచి రెండువైపులా పెనంపై నూనెతో కాల్చుకోవాలి. ఇవి రైతాతో బాగుంటాయి.

Updated Date - 2015-09-02T22:13:03+05:30 IST