సొరకాయ రొట్టె

ABN , First Publish Date - 2015-09-02T22:08:53+05:30 IST

కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము - 1 కప్పు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి - 6 రేకలు, ఉప్పు - రుచికి తగినంత

సొరకాయ రొట్టె

కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము - 1 కప్పు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి - 6 రేకలు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర, కరివేపాకు తరుగు - అరకప్పు, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు - 1 టీ స్పూను చొప్పున, ఉల్లిపాయ - సగం, వాము - అర టీ స్పూను, బియ్యప్పిండి - 1 కప్పు.
తయారుచేసే విధానం: పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి ముద్దగా నూరాలి. ఉల్లిపాయ సన్నగా తరగాలి. బియ్యప్పిండిలో సొరకాయ తురుము, కొత్తిమీర, కరివేపాకు, వాము, నువ్వులు, శనగపప్పు, ఉప్పు, ఉల్లి తరుగు, మిర్చి మిశ్రమం కలిపి ముద్ద చేసుకోవాలి. తర్వాత ఉండలు చేసుకుని రొట్టెల కర్రతో పూరీల్లా వత్తి నూనె రాసిన పెనంపై రెండు వైపులా దోరగా కాల్చాలి. వేడి వేడిగా రైతాతో తింటే బాగుంటాయి.

Updated Date - 2015-09-02T22:08:53+05:30 IST