సోయికూర చపాతీలు

ABN , First Publish Date - 2015-09-02T22:09:56+05:30 IST

కావలసిన పదార్థాలు: (6 చపాతీలకు కావలసిన) గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, శనగపిండి - అర కప్పు

సోయికూర చపాతీలు

కావలసిన పదార్థాలు: (6 చపాతీలకు కావలసిన) గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, శనగపిండి - అర కప్పు, సోయికూర తరుగు - పావు కప్పు, ఉల్లికాడల తరుగు - అరకప్పు, కారం, జీలకర్ర పొడి - అర టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - 1 కప్పు, నూనె - కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో గోధుమ, శనగ పిండిలతో పాటు (సన్నగా తరిగిన) సోయికూర, ఉల్లికాడల తరుగు, కారం, జీరాపొడి, ఉప్పు, పెరుగు వేసి (అవసరమైతే) కొద్ది నీటితో బాగా కలిపి ముద్దలా చేయాలి. దీనిపై తడిబట్ట కప్పి పదినిమిషాలు పక్కనుంచాలి. తర్వాత చపాతీలు చేసుకుని పెనంపై రెండు వైపులా (నూనె/ నెయ్యి రాస్తూ) దోరగా కాల్చుకోవాలి.

Updated Date - 2015-09-02T22:09:56+05:30 IST