ఎగ్‌ పరాటా

ABN , First Publish Date - 2019-06-15T21:40:39+05:30 IST

గోధుమపిండి - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, కోడిగుడ్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, గరంమసాల - అర టీస్పూన్‌...

ఎగ్‌ పరాటా

కావలసినవి
 
గోధుమపిండి - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, కోడిగుడ్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, గరంమసాల - అర టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
ఒకపాత్రలో గోధుమ పిండి తీసుకొని, ఉప్పు, కొద్దిగా నూనె, ఒకకప్పు నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. మెత్తగా అయ్యాక నాలుగు ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండను తీసుకుంటూ చపాతీ మాదిరిగా చేయాలి. త్రిభుజం ఆకారం మాదిరిగా రెండు చివరలు దగ్గరకు చేర్చి మళ్లీ చపాతీలా చేయాలి. ఇలా మార్చి మార్చి చేయాలి.
మరొక పాత్రలో కోడిగుడ్లు కొట్టి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరంమసాల, ఉప్పు వేసి కలియబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరాటాలను పెనంపై కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చాక కత్తితో ఒకచోట కట్‌ చేసి కోడిగుడ్డు మిశ్రమాన్ని కొద్దిగా లోపల పోయాలి. తరువాత చివరలు గట్టిగా ఒత్తి, పరాటా రెండు వైపులా కాల్చుకోవాలి.


Updated Date - 2019-06-15T21:40:39+05:30 IST