కకోరి కబాబ్‌

ABN , First Publish Date - 2019-12-28T18:01:11+05:30 IST

(ఓవెన్‌ టెంపరేచర్‌ 220 డిగ్రీలు) మటన్‌ కీమా - అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు

కకోరి కబాబ్‌

కావలసిన పదార్థాలు: (ఓవెన్‌ టెంపరేచర్‌ 220 డిగ్రీలు) మటన్‌ కీమా - అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - మూడు, బొప్పాయి ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు, లవంగాలు - నాలుగు, దాల్చినచెక్క - చిన్నముక్క, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, నెయ్యి - కొద్దిగా, కోడిగుడ్డు - ఒకటి, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌.
 
తయారీ విధానం: కీమాను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి నెయ్యిలో వేగించాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, ధనియాలపొడి, తరిగిన పచ్చిమిర్చి, బొప్పాయి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క పొడి, జీలకర్ర, జాజికాయ పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పట్టుకోవాలి. కోడిగుడ్డు వేసి మరొకసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు పుల్లల చుట్టూ మటన్‌ మిశ్రమాన్ని కబాబ్‌లా పెట్టాలి. వాటిని ఒక ట్రేలో పెట్టి, నెయ్యి రాసి ఫ్రీ హీటెడ్‌ ఓవెన్‌లో అరగంటపాటు ఉడికించాలి. బొగ్గుల గ్రిల్‌పై కూడా ఉడికించుకోవచ్చు. అయితే రెండు పక్కలా కాలేలా తిప్పుతమా ఉండాలి. చివరగా ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసుకోవాలి. చట్నీతో తింటే కకోరి కబాబ్స్‌ టేస్ట్‌ సూపర్బ్‌గా ఉంటుంది.

Updated Date - 2019-12-28T18:01:11+05:30 IST