ఆవకాయ అన్నం

ABN , First Publish Date - 2019-03-09T18:23:45+05:30 IST

ఆవకాయలో ఉన్న గుజ్జు వేరు చేసి, ముక్కలు వేరు చేసి పెట్టుకోవాలి. కావలసినంత నూనెలో సాంబార్‌ ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాలు, ఆవాలు వంటి పోపుల సామగ్రి...

ఆవకాయ అన్నం

కావలసినవి: పోపు దినుసులు, ఆవకాయ గుజ్జు, నూనె, సాంబారు ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాలు, పచ్చిమిర్చి, ఆవాలు, అన్నం.
 
తయారీ విధానం: ఆవకాయలో ఉన్న గుజ్జు వేరు చేసి, ముక్కలు వేరు చేసి పెట్టుకోవాలి.
కావలసినంత నూనెలో సాంబార్‌ ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాలు, ఆవాలు వంటి పోపుల సామగ్రి వేసి వేయించాలి. తర్వాత అందులో ఆవకాయ గుజ్జును కలపాలి. అప్పుడు మంచి మసాలా తయారవుతుంది. దానిలో ఒక కప్పు ఉడికించిన చిట్టిముత్యాల రైస్‌ (స్టీమ్డ్‌ రైస్‌) వేసి ఐదు నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉంచాలి. చివరగా గరమ్‌ మసాలా వేసి, ఫ్రైడ్‌ వెల్లుల్లి, ఫ్రైడ్‌ ఆనియన్‌, కొత్తిమీర, ఫ్రైడ్‌ చిల్లీ వేసి వడ్డించాలి.

Updated Date - 2019-03-09T18:23:45+05:30 IST