వాంగీ బాత్‌

ABN , First Publish Date - 2019-08-17T17:25:58+05:30 IST

వంకాయ - పావుకేజీ, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్‌లు, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, శనగపప్పు - అర టీస్పూన్‌, ఎండు మిర్చి - ఒకటి..

వాంగీ బాత్‌

కావలసినవి
 
వంకాయ - పావుకేజీ, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్‌లు, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, శనగపప్పు - అర టీస్పూన్‌, ఎండు మిర్చి - ఒకటి, కరివేపాకు - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, వేరుసెనగలు - కొద్దిగా, చింతపండు - పావు కప్పు, వాంగీబాత్‌ మసాలా పొడి - రెండు టేబుల్‌స్పూన్‌లు, బెల్లం - కొద్దిగా, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీస్పూన్‌, బియ్యం - ఒక కప్పు, కొత్తిమీర - ఒకకట్ట.
 
తయారీవిధానం
 
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్నాక మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. కాసేపు వేగిన తరువాత పచ్చిమిర్చి వేయాలి. తరువాత కట్‌ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి కలుపుకోవాలి. కాసేపయ్యాక వేరుసెనగలు వేసి మరికాసేపు ఫ్రై కానివ్వాలి. చింతపండు రసం పోసి, వాంగీ బాత్‌ మసాలా, బెల్లం, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. చింతపండు రసం పూర్తిగా ఇగిరిపోయే వరకు ఉడికించాలి. చివరగా అన్నం వేసి మసాలా బాగా కలిసేలా కలియబెట్టాలి. కొత్తిమీర వేసుకుని దింపుకొని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-08-17T17:25:58+05:30 IST