పుదీనా, నిమ్మకాయ నీళ్లు

ABN , First Publish Date - 2018-06-03T15:16:08+05:30 IST

పుదీనా ఆకులు (కచ్చాపచ్చాగా నూరి) - ఒక టేబుల్‌ స్పూన్‌, క్రష్డ్‌ ఐస్‌ - కొద్దిగా, నిమ్మ రసం...

పుదీనా, నిమ్మకాయ నీళ్లు

కావలసినవి
పుదీనా ఆకులు (కచ్చాపచ్చాగా నూరి) - ఒక టేబుల్‌ స్పూన్‌, క్రష్డ్‌ ఐస్‌ - కొద్దిగా, నిమ్మ రసం - రెండు టీస్పూన్లు, పంచదారసిరప్‌ - మూడు నుంచి నాలుగు టీస్పూన్లు , చల్లటి నీళ్లు - ఒక గ్లాసు.
 
తయారీ
పంచదార సిరప్‌ తయారీకి ఒక కప్పు పంచదారను అరకప్పు నీళ్లలో వేసి మరిగించాలి. చల్లారాక వాడాలి.
సర్వింగ్‌ గ్లాసులో క్రష్డ్‌ ఐస్‌ వేయాలి.
కచ్చాపచ్చాగా నూరిన పుదీనా, నిమ్మరసాలను కలపాలి.
తరువాత పంచదార సిరప్‌ వేసి, చల్లటి మంచి నీళ్లను గ్లాసు నిండుగా పోసి స్పూన్‌తో బాగా కలపాలి.
పుదీనా నిమ్మకాయ నీళ్లను వెంటనే తాగితే తాజాదనాన్ని అనుభూతి చెందొచ్చు.

Updated Date - 2018-06-03T15:16:08+05:30 IST