రొయ్యల పులావ్‌

ABN , First Publish Date - 2020-02-01T20:23:51+05:30 IST

రొయ్యలు - పావుకేజీ, ఉప్పు - తగినంత, పసుపు- రెండు టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - అర టీస్పూన్‌, నూనె - సరిపడా.

రొయ్యల పులావ్‌

కావలసినవి: రొయ్యలు - పావుకేజీ, ఉప్పు - తగినంత, పసుపు- రెండు టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - అర టీస్పూన్‌, నూనె - సరిపడా.
 
మసాల కోసం: నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - నాలుగైదు, దాల్చిన చెక్క - చిన్నముక్క, లవంగాలు - పది, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, టొమాటో - నాలుగు, కొబ్బరి తురుము - ఒక కప్పు, నిమ్మకాయ - ఒకటి, పుదీనా - చిన్న కట్ట, కొత్తిమీర - గార్నిష్‌ కోసం కొద్దిగా, ఉప్పు - తగినంత, ప్రాన్‌ స్టాక్‌ - ఆరు కప్పులు, బియ్యం - నాలుగు కప్పులు.
 
తయారీ: రొయ్యలను శుభ్రంగా కడిగి కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లిపేస్టు పట్టించి పక్కన పెట్టాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరికాసేపు వేగించాలి. ధనియాల పొడి, పసుపు వేసి కలియబెట్టాలి.టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.ఇప్పుడు కొబ్బరి తురుము వేసి మరికాసేపు ఉడకనివ్వాలి. నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. ప్రాన్‌ స్టాక్‌ వేసి ఉడికించాలి.అన్నం 80 శాతం ఉడికిన తరువాత మసాలా పట్టించిన రొయ్యలు వేసి నెమ్మదిగా కలపాలి.కొద్దిగా నిమ్మరసం పిండాలి. పుదీనా వేయాలి. మరో ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
కొత్తిమీరతో గార్నిష్‌ చేసి దించుకోవాలి.

Updated Date - 2020-02-01T20:23:51+05:30 IST