పుదీనా షర్బత్‌

ABN , First Publish Date - 2019-04-17T18:20:06+05:30 IST

వేసవిలో షర్బత్‌ తాగితే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులు, నిమ్మకాయతో చల్లచల్లని పుదీనా షర్బత్‌ తయారు చేసుకోవచ్చు.

పుదీనా షర్బత్‌

వేసవిలో షర్బత్‌ తాగితే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులు, నిమ్మకాయతో చల్లచల్లని పుదీనా షర్బత్‌ తయారు చేసుకోవచ్చు.
 
కావలసినవి: పుదీనా ఆకులు- కప్పు, తేనె లేదా చక్కెర- 8 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు- సగం కప్పు, వేగించిన జీలకర్ర పొడి- టీస్పూను, బ్లాక్‌ సాల్ట్‌- సగం టీ స్పూను, నిమ్మకాయలు - రెండు, ముక్కలుగా చేసుకున్న ఐస్‌.
 
తయారీ: ఒక పాత్రలో పుదీనా ఆకుల రసం తీసుకోవాలి. దీనిలో చక్కెర లేదా తేనె కలపి, పక్కనబెట్టుకోవాలి. గ్లాసులో ఐస్‌ ముక్కలు వేసి, పుదీనా రసాన్ని అందులో పోయాలి. నిమ్మకాయ, జీలకర్ర పొడి కలిపి అలంకరించి చల్లగా ఉన్నప్పుడే సర్వ్‌చేయాలి.

Updated Date - 2019-04-17T18:20:06+05:30 IST