Advertisement
Advertisement
Abn logo
Advertisement

జామ చీజ్‌

కావలసినవి
 
పండిన జామపళ్లు - ఐదు (రెండు ముక్కలుగా తరగాలి), చక్కెర- రెండు కప్పులు, నెయ్యి, నిమ్మరసం- ఒక్కోటి ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున.
 
తయారీ విధానం
 
ప్రెషర్‌కుక్కర్‌లో ఒక కప్పు నీళ్లు, తరిగిపెట్టుకున్న జాంపండు ముక్కలను వేసి ఒక విజిల్‌ వచ్చేవరకూ స్టవ్‌ మీద ఉంచాలి. ప్రెషర్‌ వచ్చేశాక కుక్కర్‌లోంచి ముక్కలు తీసి చల్లార్చాలి. ఉడికిన జాంపండు ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దాన్ని ఫిల్టర్‌లో వడగట్టి గుజ్జును విడిగా పెట్టాలి. గుజ్జు ఎంత ఉందో అంతే నిష్పత్తిలో చక్కెర ఉండాలి. పెద్ద నాన్‌స్టిక్‌ పాన్‌లో గుజ్జు, చక్కెర, నిమ్మరసం, నెయ్యి వేసి బాగా కలిపి సన్నని మంటపై ఉంచి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ 22 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కబడిన తర్వాత నెయ్యి రాసిన అల్యూమినియం ట్రేలోకి మార్చి రెండు గంటలు అలాగే ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. జామపండు చీజ్‌ రెడీ.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement