జామ ఐస్‌క్రీమ్‌

ABN , First Publish Date - 2018-01-06T23:15:07+05:30 IST

చిక్కటిపాలు- ఒక కప్పు, మీగడ- రెండుంబావు కప్పులు, పండిన జామపళ్లు-మూడు (మీడియం సైజు), చక్కెర- ముప్పావు కప్పు...

జామ ఐస్‌క్రీమ్‌

కావలసినవి
 
చిక్కటిపాలు- ఒక కప్పు, మీగడ- రెండుంబావు కప్పులు, పండిన జామపళ్లు-మూడు (మీడియం సైజు), చక్కెర- ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌-అర టీస్పూను, చక్కెర (జామపళ్ల గుజ్జు కోసం)- రెండు టేబుల్‌స్పూన్లు, టాపింగ్‌ కోసం... కారం- అర టీస్పూను, ఉప్పు-ముప్పావు టీస్పూను.
 
తయారీ విధానం
 
జామ ఐస్‌ క్రీమ్‌ తయారుచేయడానికి ఒకరోజు ముందే ఐస్‌క్రీమ్‌ కంటైనర్‌ని బాగా చల్లబర్చాలి. జామకాయ పైన ఉన్న తొక్క తీసి, గుజ్జులోని గింజల్ని కూడా తీసేయాలి. తరువాత జామపండును చిన్నముక్కలుగా తరగాలి. ఈ ముక్కల్ని మిక్సీలో వేసి చక్కెర వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఐస్‌క్రీమ్‌ మేకర్‌లో పాలు, మీగడ, వెనిల్లా ఎసెన్స్‌, కొద్దిగా ఉప్పు, సిద్ధం చేసుకున్న జామపండు గుజ్జులను అందులో పోయాలి. అది బాగా కలిసిపోయి గడ్డలా తయారయ్యే వరకు మేకర్‌లోనే ఉంచాలి. మెత్తగా అయిన ఐస్‌క్రీమును ఫ్రీజర్‌ కంటైనర్‌ నుంచి తీసి పది గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తినేముందు ఉప్పు, కారం కలిపి ఐస్‌క్రీమ్‌ మీద కొద్దిగా చల్లుకుని తింటే స్పైసీగా, వెరైటీ రుచితో ఉంటుంది.

Updated Date - 2018-01-06T23:15:07+05:30 IST