లెమన్‌ స్క్వాష్‌

ABN , First Publish Date - 2018-03-02T17:15:05+05:30 IST

నిమ్మరసం, మంచి నీళ్లు - ఒక్కో కప్పు చొప్పున, పంచదార - అర కిలో, కుంకుమపువ్వు - అర టీస్పూన్‌...

లెమన్‌ స్క్వాష్‌

కావలసినవి
 
నిమ్మరసం, మంచి నీళ్లు - ఒక్కో కప్పు చొప్పున, పంచదార - అర కిలో, కుంకుమపువ్వు - అర టీస్పూన్‌ (ఇష్టపడితేనే), ఆకుపచ్చ యాలక్కాయల పొడి - ఒక టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
సాస్‌ పాన్‌లో కప్పు నీళ్లు పోసి, పంచదార వేయాలి. పాన్‌ను సన్నటి మంట మీద పెట్టి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ పంచదార మిశ్రమాన్ని వేడిచేయాలి. పంచదార పూర్తిగా కరిగాక మిశ్రమం పట్టుకుంటే చేతి వేళ్లకు అతుక్కుంటుంది. అప్పుడు స్టవ్‌ ఆపేయాలి. వేడివేడి పంచదార నీళ్లను ఒక గిన్నెకు పలుచని బట్ట కట్టి వడకట్టాలి. గోరు వెచ్చగా లేదా గది ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు అలానే ఉంచాలి. తరువాత అందులో నిమ్మరసాన్ని కలిపి, యాలక్కాయల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలియబెడితే లెమన్‌ స్క్వాష్‌ రెడీ. దీన్ని శుభ్రమైన గాజు సీసాలో పోసి గట్టిగా మూత బిగించి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి. ఎప్పుడు లెమన్‌ స్క్వాష్‌ తాగాలనిపిస్తే అప్పుడు తయారుచేసుకుని తాగేయొచ్చు. అదెలాగంటే నాలుగు టేబుల్‌ స్పూన్ల లెమన్‌ స్క్వాష్‌ను ఒక గ్లాసులో తీసుకుని, నీళ్లు పోసి, ఇందులో ఐస్‌ క్యూబ్‌లు కలుపుకోవచ్చు లేదా చల్లటి నీళ్లు కలిపైనా తాగేయొచ్చు.

Updated Date - 2018-03-02T17:15:05+05:30 IST