జలబ్‌

ABN , First Publish Date - 2018-02-28T18:31:06+05:30 IST

బాదం గింజలు - ఐదు (తురిమి, క్రష్‌ చేసి కూడా వాడొచ్చు), ఎండుద్రాక్షలు - పది, రోజ్‌ వాటర్‌...

జలబ్‌

కావలసినవి
బాదం గింజలు - ఐదు (తురిమి, క్రష్‌ చేసి కూడా వాడొచ్చు), ఎండుద్రాక్షలు - పది, రోజ్‌ వాటర్‌ - రెండు టీస్పూన్లు, దానిమ్మ గింజలు - అర టీస్పూన్‌, క్రష్డ్‌ ఐస్‌ - ఒక కప్పు, డేట్‌ సిరప్‌ - అర కప్పు.
 
తయారీవిధానం
ఒక గిన్నెలో బాదం గింజల తురుము, ఎండు ద్రాక్షలు, రోజ్‌ వాటర్‌, దానిమ్మ గింజలు, డేట్‌ సిరప్‌, క్రష్డ్‌ ఐస్‌లను వేసి బాగా కలపాలి. తరువాత దాన్ని సర్వింగ్‌ గ్లాసుల్లో పోయాలి. అంటే జలబ్‌ డ్రింక్‌ రెడీ. ఈ పదార్థాలతో ఇద్దరికి వస్తుంది.

Updated Date - 2018-02-28T18:31:06+05:30 IST