ఆలూ ఘోష్‌

ABN , First Publish Date - 2019-09-07T19:00:42+05:30 IST

మటన్‌-అరకేజీ, బంగాళదుంపలు-రెండు, ఉల్లిపాయలు- నాలుగు, దాల్చిన చెక్క-చిన్నముక్క, యాలకులు-నాలుగైదు, బిర్యానీ ఆకులు- రెండు, పచ్చిమిర్చి - నాలుగు

ఆలూ ఘోష్‌

కావలసినవి
 
మటన్‌-అరకేజీ, బంగాళదుంపలు-రెండు, ఉల్లిపాయలు- నాలుగు, దాల్చిన చెక్క-చిన్నముక్క, యాలకులు-నాలుగైదు, బిర్యానీ ఆకులు- రెండు, పచ్చిమిర్చి - నాలుగు, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, ఆవాల నూనె - సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, టొమాటోలు - నాలుగు, కారం - ఒక టీస్పూన్‌, ధనియాలపొడి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, గరంమసాల - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
కుక్కర్‌లో మటన్‌, ఉల్లిపాయలు, దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఒకకప్పు నీళ్లు పోసి చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌, టొమాటో ముక్కలు వేసి వేగించాలి. ధనియాల పొడి, కారం, పసుపు, గమరంసాలా వేసి మరికాసేపు వేగించాలి. తరువాత బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్‌ వేసి కలియబెట్టాలి. బంగాళదుంపలు ఉడికేందుకు కొద్దిగా నీళ్లు పోయాలి.
కాసేపయ్యాక తగినంత ఉప్పు వేసి, గరంమసాలా పొడి వేసుకొని దింపుకోవాలి.

Updated Date - 2019-09-07T19:00:42+05:30 IST