గోంగూర చికెన్‌

ABN , First Publish Date - 2019-09-07T18:59:46+05:30 IST

చికెన్‌ - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, టొమాటో - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, పసుపు - అర టీస్పూన్‌, గరంమసాలా

గోంగూర చికెన్‌

కావలసినవి
 
చికెన్‌ - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, టొమాటో - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, పసుపు - అర టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, మెంతులు - పావు టీస్పూన్‌, ఽకారం - తగినంత, దనియాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - నాలుగు, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌, గొంగూర - రెండు కప్పులు (కట్‌ చేసినది).

తయారీవిధానం
 
ఒక పాన్‌ తీసుకొని మెంతులు, ధనియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి వేగించాలి. చల్లారిన తరువాత వీటిని మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టాలి. కుక్కర్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక టొమాటో ముక్కలు వేసి వేగించాలి. టొమాటో మెత్తగా ఉడికిన తరువాత చికెన్‌ వేసి, గరంమసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి. పావు కప్పు నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూర ఆకులను శుభ్రంగా కడగాలి. మరొక పాన్‌లో నూనె వేసి వెలుల్లి రెబ్బలు, గోంగూర వేసి వేగించాలి. కొంచెం ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర మెత్తగా, పేస్టు మాదిరిగా అవుతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్‌ వేసి కలపాలి. చిన్నమంటపై కాసేపు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-09-07T18:59:46+05:30 IST