మ్యాంగో దాల్‌

ABN , First Publish Date - 2019-04-27T20:54:26+05:30 IST

కందిపప్పు - 300గ్రాములు, మామిడికాయ - ఒకటి, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, కారం - టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌,

మ్యాంగో దాల్‌

కావలసిన పదార్థాలు
 
కందిపప్పు - 300గ్రాములు, మామిడికాయ - ఒకటి, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, కారం - టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, నిమ్మరసం - కొద్దిగా, నెయ్యి - టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - టీస్పూన్‌, జీలకర్ర - టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
ముందుగా కందిపప్పును ఉడికించుకోవాలి. మామిడికాయ పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒకపాత్రలో నూనె వేసి, వేడి అయ్యాక ఉడికించిన కందిపప్పును అందులో వేయాలి. కారం, అల్లం వెలుల్లి పేస్ట్‌, పసుపు, నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. తరువాత మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి, కలపాలి. మరొక పాత్రలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో వేసి కలిపి, మరికాసేపు ఉడికించుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-04-27T20:54:26+05:30 IST