గోధుమ ఉండలు

ABN , First Publish Date - 2015-09-01T23:18:16+05:30 IST

కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు,

గోధుమ ఉండలు

కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, ఎండుకొబ్బరి కోరు - అరకప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా (ముక్కలు) కలిపి - అరకప్పు, గసాలు - 2 టీ స్పూన్లు, యాలకులు - 4, నెయ్యి - 50 గ్రా.
తయారుచేసే విధానం : దళసరి కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కల్ని వేగించి తీసేయాలి. అందులోనే గోధుమపిండిని వేసి సన్నని సెగమీద బంగారురంగు వచ్చేదాక వేగించాలి. ఒక పాత్రలో బెల్లంతురుము, కొద్దిగా నీరుపోసి వేడి చెయ్యాలి. బెల్లం కరిగేదాకా తిప్పుతూ ఒక్కపొంగు రాగానే యాలకులపొడి వేసి దించేయాలి. తర్వాత గోధుమపిండి, వేగించిన బాదం, జీడి, పిస్తా ముక్కల్ని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కాస్త ఆరిన తర్వాత పాలతో చెయ్యి తడుపుకుంటూ ఉండలు చుట్టుకుని గసాల్లో దొర్లించుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

Updated Date - 2015-09-01T23:18:16+05:30 IST