Abn logo

రెడ్‌గ్రామ్‌-పొటాటో సలాడ్‌

కావలసిన పదార్థాలు : కందులు-ఒక కప్పు, బంగాళదుంప(పెద్దది)-1, టమాట(చిన్నది)-1, పచ్చిమిర్చి-1, ఉల్లిపాయ(చిన్నది)-1, చాట్‌ మసాల లేదా కారం-అర టీ స్పూన్‌, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం :
కందులను బాగా నానబెట్టి ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బంగాళదుంపను కూడా ఉడికించి పైన పొట్టుతీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి కందులలో వేయాలి. తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఆ ముక్కలను కూడా వీటికి జతచే సి, కొద్దిగా చాట్‌ మసాలా వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీర చల్లుకుని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఏదైనా పండ్ల రసం తాగుతూ తింటే భలే రుచిగా ఉంటుంది.

నెలాఖరులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలిఆలయ అభివృద్ధికి దాతలు కృషి చేయాలిపారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు అంబులెన్స్‌ ఇవ్వడం ఆనందంగా ఉందిపేదల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ గుబులుసబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి దందాకేంద్రం విధానాలు సరికాదు అక్రమ లే అవుట్లను గుర్తించాలినూతన రెవెన్యూ చట్టం అభినందనీయం కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం
Advertisement
Advertisement