స్వీట్‌ మ్యాంగో చికెన్‌ కర్రీ

ABN , First Publish Date - 2018-04-29T20:37:34+05:30 IST

పండిన మామిడి ముక్కలు - 450 గ్రా., ఆలివ్‌ నూనె - ఒక టేబుల్‌ స్పూను, బోన్‌లెస్‌ చికెన్‌..

స్వీట్‌ మ్యాంగో చికెన్‌ కర్రీ

కావలసిన పదార్థాలు
 
పండిన మామిడి ముక్కలు - 450 గ్రా., ఆలివ్‌ నూనె - ఒక టేబుల్‌ స్పూను, బోన్‌లెస్‌ చికెన్‌ - ఒక కిలో, కుర్మా పేస్టు (మార్కెట్లో దొరుకుతుంది) - వంద గ్రా, ఉల్లిపాయ - ఒకటి, ఎర్ర క్యాప్సికం - ఒకటి, అల్లం తరుగు - ఒక టీ స్పూను, చిదిమిన వెల్లుల్లి రెబ్బ - ఒకటి, కొబ్బరి పాలు - 400 మి.గ్రా, చికెన్‌ స్టాక్‌ - అర కప్పు.
 
తయారుచేసే విధానం
 
మామిడి ముక్కల్ని మిక్సీలో వేసి గుజ్జుగా చేసి పక్కనుంచాలి. పాన్‌లో తగినంత నూనె వేసి మీడియం మంటపైన చికెన్‌ ముక్కల్ని రంగు మారేవరకు దోరగా వేగించి తియ్యాలి. ఇప్పుడు అదే పాన్‌లో మరి కొద్దిగా నూనె వేసి ఉల్లి తరుగు, క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి తరుగు 2 నిమిషాల పాటు వేగించాలి. ఇప్పుడు కూర్మాపేస్టు కలిపి మూడు నిమిషాల తర్వాత కొబ్బరి పాలు, చికెన్‌ స్టాక్‌, మామిడి గుజ్జు, చికెన్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. ముక్క మెత్తబడ్డాక దించేసి కొత్తిమీర తరుగు చల్లాలి. దీనికి వేడి వేడి బాస్మతి రైస్‌ మంచి కాంబినేషన్‌.

Updated Date - 2018-04-29T20:37:34+05:30 IST