పత్తర్‌ కా ఘోష్‌

ABN , First Publish Date - 2017-10-21T22:32:03+05:30 IST

అల్లం: 20 గ్రాములు, వెల్లుల్లి: 20 గ్రాములు, పచ్చిమిరపకాయలు 5 గ్రాములు, పత్తర్‌ కా ఫూల్‌...

పత్తర్‌ కా ఘోష్‌

కావాల్సిన పదార్థాలు
అల్లం 20 గ్రాములు, వెల్లుల్లి 20 గ్రాములు, పచ్చిమిరపకాయలు 5 గ్రాములు, పత్తర్‌ కా ఫూల్‌ 10 గ్రాములు(నూరినది), నల్లమిరియాల పొడి 10 గ్రాములు, ఉప్పు తగినంత,
గరంమసాలా పౌడర్‌ 5 గ్రాములు, రిఫైన్డ్‌ ఆయిల్‌ 50 మిల్లీలీటర్లు, మాంసం (బోన్‌లెస్‌) 500 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, పచ్చి బొప్పాయి 10 గ్రాములు.
 
తయారీ విధానం
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పత్థర్‌ కా ఫూల్‌, రిఫైన్డ్‌ ఆయిల్‌, ఉప్పు, గరం మసాలా పౌడర్‌, జీడిపప్పు, పచ్చి బొప్పాయి ఓ గిన్నెలో తీసుకోవాలి. గిన్నెలోనే మాంసం కూడా వేసి గంట పాటు పక్కన నాననివ్వాలి. గ్రానైట్‌, లేదంటే చార్‌కోల్‌ స్టోన్‌ను బాగా వేడి చేయాలి. నానిన మాంసాన్ని గ్రానైట్‌ స్టోన్‌పై వేసి రెండు వైపులా బాగా ఉడికించాలి. ఆనియన్‌ రింగ్స్‌, లేదంటే నిమ్మకాయ ముక్కలతో సర్వ్‌ చేసుకుంటే బాగుంటుంది.

Updated Date - 2017-10-21T22:32:03+05:30 IST