ఓట్స్‌ ఫ్రూట్‌ స్మూతీ

ABN , First Publish Date - 2016-04-13T20:16:16+05:30 IST

ఓట్స్‌(నానబెట్టి) - అరకప్పు, సోయా మిల్క్‌ - ఒక కప్పు, అరటిపండు ముక్కలు - అరకప్పు, యాపిల్‌ ముక్కలు - పావు కప్పు, తేనె - ఒక టేబుల్‌ స్పూన్‌, దాల్చినచెక్కపొడి

ఓట్స్‌ ఫ్రూట్‌ స్మూతీ

కావలసినవి: ఓట్స్‌(నానబెట్టి) - అరకప్పు, సోయా మిల్క్‌ - ఒక కప్పు, అరటిపండు ముక్కలు - అరకప్పు, యాపిల్‌ ముక్కలు - పావు కప్పు, తేనె - ఒక టేబుల్‌ స్పూన్‌, దాల్చినచెక్కపొడి - చిటికెడు, బాదం గింజల పలుకులు - అలంకరణకు.
తయారీ: నానబెట్టిన ఓట్స్‌, కొన్ని యాపిల్‌, అరటిపండు ముక్కలు తీసుకుని బ్లెండర్‌లో వేయాలి. దాల్చినచెక్కపొడి, తేనె కూడా వేసి బ్లెండ్‌ చేయాలి. చిక్కటి స్మూతీని గ్లాసులో పోసి బాదం పలుకులతో అలంకరించాలి. అవసరమనుకుంటే ఐస్‌ ముక్కలు వేసుకోవచ్చు.

Updated Date - 2016-04-13T20:16:16+05:30 IST