అమృత్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2018-11-24T18:07:32+05:30 IST

అరటిపండ్లు, యాపిల్‌, ద్రాక్ష, సంత్రా, స్ట్రాబెర్రీలు, ప్లమ్‌, పుచ్చకాయ, పెరుగు, తేనె, నెయ్యి, పాలు, జీడిపప్పు...

అమృత్‌ సలాడ్‌

కావలసినవి
 
అరటిపండ్లు, యాపిల్‌, ద్రాక్ష, సంత్రా, స్ట్రాబెర్రీలు, ప్లమ్‌, పుచ్చకాయ, పెరుగు, తేనె, నెయ్యి, పాలు, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌, చక్కెర, పిస్తా, కివీ.
 
తయారీవిధానం
 
పుచ్చకాయ నుంచి స్కూప్స్‌ తీసుకొని ఒక బౌల్‌లో వేయాలి. యాపిల్‌, కివీ, సంత్రా, ప్లమ్‌, ద్రాక్ష, చెర్రీలను ముక్కలుగా కట్‌ చేసి అదే బౌల్‌లో వేయాలి. బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌, పిస్తాలను నెయ్యి వేయకుండా దేనికి దానికి విడి విడిగా పాన్‌లో వేగించాలి. ఇలా వేగించడం వల్ల అవి కరకరలాడుతాయి. సలాడ్‌ డ్రెస్సింగ్‌ కోసం పంచామృతాన్ని అంటే తేనె, నెయ్యి (రెండు చుక్కలు),చక్కెర, పెరుగు, పాలు, అరటిపండ్ల్లు అన్నీ కలిపి తయారుచేయాలి. పండ్ల్లముక్కల్లో ఈ పంచామృతం కలపాలి. దానిపై వేగించిన కొన్ని డ్రైఫ్రూట్స్‌ను చల్లాలి. పుచ్చకాయముక్కను కార్వింగ్‌ చేసి అందులో అమృత్‌ సలాడ్‌ పెట్టి దానిపై పిస్తాతో సహా మిగిలిన డ్రైఫ్రూట్స్‌ చల్లితే అమృత్‌ సలాడ్‌ రెడీ. ఉపవాసం ఉన్న వారికి ఇది ఎంతో ఆరోగ్యవంతమైన పోషకాహారం.

Updated Date - 2018-11-24T18:07:32+05:30 IST