చికెన్‌ ఫింగర్స్‌

ABN , First Publish Date - 2016-05-21T15:57:26+05:30 IST

కావలసిన పదార్థాలు : చికెన్‌ - అరకేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పుదీనా ఆకులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, కారం, గరంమసాలా - ఒక్కోటి అరస్పూన్‌ చొప్పున, ఉప్పు

చికెన్‌ ఫింగర్స్‌

కావలసిన పదార్థాలు : చికెన్‌ - అరకేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పుదీనా ఆకులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, కారం, గరంమసాలా - ఒక్కోటి అరస్పూన్‌ చొప్పున, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, కోడిగుడ్డు - ఒకటి, బ్రెడ్‌ పొడి - కొద్దిగా.

తయారుచేయు విధానం :
చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో పుదీనా ఆకులు, అల్లం వెలుల్లి పేస్టు, ఉప్పు, ఉల్లిపాయలు, కారం, నిమ్మరసం వేయాలి. కొంచెం నూనె, కోడిగుడ్డు వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బ్రెడ్‌ పొడి కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ పాన్‌లో పావుగంట బేక్‌ చేయాలి. కరకరలాడుతున్న చికెన్‌ ఫింగర్స్‌ను వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటాయి.

Updated Date - 2016-05-21T15:57:26+05:30 IST