కర్బూజ పానకం

ABN , First Publish Date - 2018-05-18T18:14:49+05:30 IST

కర్బూజ - పావు భాగం, బెల్లం పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు లేదా రుచికి సరిపడా, మిరియాల...

కర్బూజ పానకం

కావలసినవి
 
కర్బూజ - పావు భాగం, బెల్లం పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు లేదా రుచికి సరిపడా, మిరియాల పొడి - కొంచెం, యాలకుల పొడి - కొంచెం, మంచినీళ్లు - రెండు కప్పులు.
 
తయారీవిధానం
కర్బూజ చెక్కు, గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీ జార్‌లో కర్బూజ ముక్కల్ని వేసి బ్లెండ్‌ చేయాలి. తరువాత బెల్లం పొడి కలపాలి. తరువాత సరిపడా మంచినీళ్లు పోసి మళ్లీ ఒకసారి బ్లెండ్‌ చేయాలి. ఒక గిన్నెలోకి బ్లెండ్‌ చేసిన కర్బూజ జ్యూస్‌ను పోయాలి. మిగిలిన మంచి నీళ్లను కలపాలి. మిరియాలు, యాలకుల పొడి కలపాలి. వీటిని గ్రైండ్‌ చేసేటప్పుడు కూడా కలపొచ్చు. కర్బూజ ముక్కలతో అలంకరించిన కన్నడ వేసవి పానీయాన్ని తయారుచేసుకున్న వెంటనే తాగేయాలి.

Updated Date - 2018-05-18T18:14:49+05:30 IST