పైనాపిల్‌ కేక్‌

ABN , First Publish Date - 2015-12-15T15:01:34+05:30 IST

కావలసిన పదార్థాలు: వెనీలా స్పాంజ్‌ కేక్‌ - ఒకటి, పంచదార నీళ్లు - అరకప్పు, పైనాపిల్‌ ఎసెన్స్‌ - ఆరు చుక్కలు, పైనాపిల్‌ ముక్కలు - నాలుగు, కేక్‌ క్రీము - నాలుగు టీ స్పూన్లు,

పైనాపిల్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: వెనీలా స్పాంజ్‌ కేక్‌ - ఒకటి, పంచదార నీళ్లు - అరకప్పు, పైనాపిల్‌ ఎసెన్స్‌ - ఆరు చుక్కలు, పైనాపిల్‌ ముక్కలు - నాలుగు, కేక్‌ క్రీము - నాలుగు టీ స్పూన్లు, చెర్రీస్‌ - సరిపడా.
తయారుచేయు విధానం: స్పాంజ్‌ కేక్‌ తీసుకుని కింది, పై భాగాలను కట్‌ చేసి తీసేయాలి. తర్వాత కేకుని మూడు పొరలుగా కట్‌ చేసుకోవాలి. పంచదార నీళ్లలో పైనాపిల్‌ ఎసెన్స్‌ కలుపుకోవాలి. ఒక్కో పొరపై మూడు టీ స్పూన్ల పంచదార నీళ్లు వేయాలి. తరువాత క్రీము రాయాలి. వీటిని ఒకదానిపై ఒకటి పెట్టుకుని సాండ్‌విచ్‌లా చేసుకోవాలి. ఈ కేకుని మనకి నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకుని చెర్రీలు, పైనాపిల్‌ ముక్కలతో అలంకరించి ఓ పావుగంట ఫ్రిజ్‌లో పెట్టి తినాలి.

Updated Date - 2015-12-15T15:01:34+05:30 IST