మిల్క్‌ మిక్స్‌ ఫలహారం

ABN , First Publish Date - 2015-12-13T14:22:31+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలు - ఒక కప్పు, అరటిపండ్ల ముక్కలు - అర కప్పు, నల్ల ద్రాక్ష పండ్లు - ఐదు, పైనాపిల్‌ ముక్కలు - నాలుగు, గ్రీన్‌ యాపిల్‌ ముక్కలు - ఐదు, రెడ్‌

మిల్క్‌ మిక్స్‌ ఫలహారం

కావలసిన పదార్థాలు: పాలు - ఒక కప్పు, అరటిపండ్ల ముక్కలు - అర కప్పు, నల్ల ద్రాక్ష పండ్లు - ఐదు, పైనాపిల్‌ ముక్కలు - నాలుగు, గ్రీన్‌ యాపిల్‌ ముక్కలు - ఐదు, రెడ్‌ యాపిల్‌ ముక్కలు - నాలుగు, పంచదార - అర కప్పు, ఐస్‌ క్రీము - పావు కప్పు.
తయారుచేయు విధానం: పాలను బాగా కాచి చల్లారిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. తర్వాత పండ్ల ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. దీనిపై ఐస్‌క్రీము, తేనె వేసి బాగా మళ్లీ కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. బాగా చల్లబడిన తర్వాత తీసి తినాలి.

Updated Date - 2015-12-13T14:22:31+05:30 IST