చీజ్‌ ఆమ్లెట్‌

ABN , First Publish Date - 2015-08-30T18:19:15+05:30 IST

కావలసినవి: కోడిగుడ్లు- రెండు, తురిమిన చీజ్‌- 50 నుంచి 100 గ్రాములు, ఆలివ్‌ ఆయిల్‌- ఒక టేబుల్‌ స్పూన్‌

చీజ్‌ ఆమ్లెట్‌

కావలసినవి: కోడిగుడ్లు- రెండు, తురిమిన చీజ్‌- 50 నుంచి 100 గ్రాములు, ఆలివ్‌ ఆయిల్‌- ఒక టేబుల్‌ స్పూన్‌, పెప్పర్‌- పైన చల్లడానికి.
ఎలా చేయాలి
కోడిగుడ్లను పగులగొట్టి పచ్చసొనను ఒక బౌల్‌లో, తెల్లసొనను ఒక బౌల్‌లో వేరు చేసి ఉంచుకోవాలి. ముందుగా తెల్లసొనను రెండు నిముషాలు బాగా కలిపి, ఆ తరువాత పచ్చసొనను మిక్స్‌ చేయాలి. చీజ్‌ ఆమ్లెట్‌ వేయడానికి ఇది చాలా ముఖ్యమైనది. నాన్‌స్టిక్‌ పాన్‌ను తీసుకుని అందులో ఆయిల్‌ వే సి వేడిచేసి కోడిగుడ్ల సొనలను వేయాలి. వేగాక రెండవ వైపు తిప్పాలి. రెండవ వైపు తిప్పిన తరువాత దానిపైన తురిమి ఉంచుకున్న చీజ్‌ను వేయాలి. చీజ్‌ను ఎక్కువభాగం మధ్యలోనే ఉండేట్లు చూసుకుని ముప్ఫై సెకన్లు అలాగే ఉంచి దోశెను మడత వేసినట్లు మడత వేయాలి. దీనిపైన పెప్పర్‌ చల్లి టమోటో కచెప్‌తో వేడిగా వడ్డించాలి. 

Updated Date - 2015-08-30T18:19:15+05:30 IST