పుదీనా షర్బత్‌

ABN , First Publish Date - 2015-08-31T20:00:58+05:30 IST

కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు - ముప్పావు కప్పు, పంచదార - పావు కప్పు, నిమ్మరసం - అరకప్పు, రాతి ఉప్పు

పుదీనా షర్బత్‌

కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు - ముప్పావు కప్పు, పంచదార - పావు కప్పు, నిమ్మరసం - అరకప్పు, రాతి ఉప్పు - 1 టీ స్పూను, వేగించిన జీలకర్ర పొడి - 1 టీ స్పూను, అల్లం తరుగు - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: పుదీనా ఆకులు, పంచదార, అల్లం ముక్కలు, నిమ్మరసం (కొద్ది నీరు కలిపి) మిక్సీలో పేస్టు చేసి వడకట్టాలి. ఈ మిశ్రమానికి 4 కప్పులు నీరు, జీలకర్ర పొడి, ఉప్పు కలిపి రిఫ్రిజిరేటర్‌లో చల్లబడేవరకు ఉంచాలి. తాగేముందు 2 ఐస్‌ క్యూబ్స్‌ వేసుకుంటే మరింత బాగుంటుంది.

Updated Date - 2015-08-31T20:00:58+05:30 IST