జామకాయ జామ్‌

ABN , First Publish Date - 2015-08-30T19:15:56+05:30 IST

కావలసిన పదార్థాలు: జామ పళ్లు - అర కేజీ, నీరు - 2 కప్పులు, పంచదార - 1 కప్పు, నిమ్మరసం - 1 టీ స్పూను

జామకాయ జామ్‌

కావలసిన పదార్థాలు: జామ పళ్లు - అర కేజీ, నీరు - 2 కప్పులు, పంచదార - 1 కప్పు, నిమ్మరసం - 1 టీ స్పూను, (ఆకుపచ్చ / పసుపు పచ్చ) ఫుడ్‌ కలర్‌ - చిటికెడు.
తయారుచేసే విధానం: జామపళ్లను శుభ్రంగా కడిగి, అడ్డంగా సాధ్యమైనంత సన్న చక్రాల్లా కోయాలి. నీటిలో జామ ముక్కలు వేసి కుక్కర్లో 2, 3 విజిల్స్‌ వచ్చేవరకు ఉంచాలి. చల్లారిన తర్వాత మెదిపి సన్నని బట్టలో వడకట్టాలి. దిగిన నీరు 2 కప్పులకి కొలత ఉండేలా చూసుకోవాలి. ఈ నీటిలో పంచదార, (అర టీ స్పూను నీటిలో కరిగించి) మీకిష్టమైన ఫుడ్‌ కలర్‌ కలిపి సన్నటి మంటపై ఉంచాలి. తీగపాకం రాగానే నిమ్మరసం పోసి పెద్దమంటపై 2 నిమిషాలు ఉంచి దించేయాలి. జామ్‌ గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ఫ్రిజ్‌లో కనీసం 4 గంటలు ఉంచి, ఆ తర్వాత మాత్రమే వాడుకోవాలి. (ఎరుపు జామ పండ్లయితే ఫుడ్‌ కలర్‌ వేసుకోనక్కర్లేదు)

Updated Date - 2015-08-30T19:15:56+05:30 IST