తాటి ముంజల రోజ్‌ సిరప్‌

ABN , First Publish Date - 2015-08-31T20:25:49+05:30 IST

కావలసిన పదార్థాలు: లేత తాటిముంజలు - 4, కాచి, చల్లార్చిన పాలు - 3 కప్పులు, రోజ్‌ సిరప్‌

తాటి ముంజల రోజ్‌ సిరప్‌

కావలసిన పదార్థాలు: లేత తాటిముంజలు - 4, కాచి, చల్లార్చిన పాలు - 3 కప్పులు, రోజ్‌ సిరప్‌ (మార్కెట్లో దొరుకుతుంది) - 4 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: ముంజల పై తొక్క తీయాలి. రెండు ముంజల్ని చిన్న చిన్నముక్కలుగా కట్‌ చేసి ఒక స్పూను రోజ్‌ సిరప్‌, ఒక స్పూను పాలలో కలిపి పక్కనుంచాలి. మిగతా రెండు ముంజల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ గుజ్జులో మిగిలిన పాలు, రోజ్‌ సిరప్‌ కలిపి బాగా చల్లబడేవరకు ఫ్రిజ్‌లో పెట్టాలి. సర్వ్‌ చేసేముందు రోజ్‌ సిరప్‌తో కలిపి పక్కనుంచిన ముంజ ముక్కల్ని పైన వేయాలి. పంచదార విడిగా వేయరాదు. రోజ్‌ సిరప్‌ స్వీట్‌గా ఉంటుంది.

Updated Date - 2015-08-31T20:25:49+05:30 IST