Advertisement
Advertisement
Abn logo
Advertisement

చింతపండు చట్నీ

కావలసిన పదార్థాలు : చింతపండు- నాలుగు రెబ్బలు, ఎండుమిరప కాయలు- మూడు, మినపపప్పు- మూడు చెంచాలు, నువ్వులు- మూడు చెంచాలు, ధనియాలు-2 చెంచాలు, ఎండు కొబ్బరి పొడి- 2 చెంచాలు, నూనె- చెంచా, బెల్లం లేదా పంచదార- 2 చెంచాలు, ఉప్పు తగినంత.
తయారీ విధానం :
ముందుగా చింతపండును నానబెట్టాలి. తర్వాత మినపపప్పు, నువ్వులు, ధనియాలు విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. ఒక బాణలిలో నూనెపోసి ఎండు మిర పకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో చింతపండు రసం, చింతపండు రెబ్బలు, మినపపొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, బెల్లం వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఇష్టమున్నవాళ్లు తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలో లేదా పూరీ, చపాతీల మీదగాని వేసుకుని తినవచ్చు.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement