వంకాయ మసాలా కూర

ABN , First Publish Date - 2018-10-06T18:55:48+05:30 IST

నువ్వులపొడి, పల్లీపొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి, లవంగాలు, చిన్న దాల్చినచెక్క (దంచి) పొడి, నీళ్లు (కొద్దిగా).

వంకాయ మసాలా కూర

కావలసినవి
 
నువ్వులపొడి, పల్లీపొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి, లవంగాలు, చిన్న దాల్చినచెక్క (దంచి) పొడి, నీళ్లు (కొద్దిగా).
 
తయారీవిధానం
 
పైన పేర్కొన్న అన్ని పొడులను మిశ్రమంలా కలపాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి ముద్దలా చేసుకోవాలి. సైజు కాస్త పెద్దగా ఉండే వంకాయలను తీసుకుని వాటిపై అడ్డంగా, నిలువుగా కత్తితో గాట్లు పెట్టాలి. ఇలా కోసిన వంకాయలలో రెడీగా పెట్టుకున్న కూరపొడి మిశ్రమాన్ని కూరాలి. పొయ్యి మీద నల్లటి మట్టికుండను పెట్టి దాంట్లో వంకాయలకు సరిపడా నూనె పోయాలి. వేడెక్కిన నూనెలో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయముక్కల్ని, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, పసుపు వేసి వేగించాలి.
ఆ మిశ్రమంలో అల్లం-వెల్లుల్లి పేస్టు కూడా కలపాలి. అందులో మసాలా పొడి కూరిన వంకాయలు వేసి మెత్తగా అయ్యేదాకా మూతపెట్టి ఉడికించాలి. ఊరి వంకాయ మసాలాకూర రెడీ.

Updated Date - 2018-10-06T18:55:48+05:30 IST