మ్యాంగో ఫిర్ని

ABN , First Publish Date - 2015-08-31T18:40:43+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలు - రెండు లీటర్లు, అన్నం - 4 టేబుల్‌ స్పూన్లు, పంచదార - 300 గ్రా., పండిన మామిడిపళ్లు

మ్యాంగో ఫిర్ని

కావలసిన పదార్థాలు: పాలు - రెండు లీటర్లు, అన్నం - 4 టేబుల్‌ స్పూన్లు, పంచదార - 300 గ్రా., పండిన మామిడిపళ్లు - 3, యాలకుల పొడి- 1 టీ స్పూను, బాదం - 10, పిస్తా - 10
తయారుచేసే విధానం: ముందుగా బియ్యాన్ని గంటసేపు నానబెట్టి పేస్టులా రుబ్బుకొని ఉంచుకోవాలి. దళసరి అడుగున్న పాత్రలో పాలను సన్నని మంటపై వేడిచేస్తూ మరిగించాలి. మరిగే పాలల్లో బియ్యం పేస్టుని కలపాలి. బియ్యం పేస్టు ఉడికి పాలు చిక్కబడ్డాక పంచదార వేసి మరో 4 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించేసి, అందులో మామిడి పండు ముక్కల్ని (తొక్క తీసినవి) కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక మట్టిపాత్రలో వేసి యాలకుల పొడి చల్లి, తరిగిన బాదం, పిస్తాలతో అలంకరించి పదిగంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-31T18:40:43+05:30 IST