కశ్మీరీ రోగన్‌ జోష్‌

ABN , First Publish Date - 2016-07-16T17:53:48+05:30 IST

కావలసిన పదార్థాలు: నూనె - 5 టే.స్పూన్లు, యాలకులు - 5, లవంగాలు - 4, దాల్చిన చెక్క - చిన్న ముక్క, బిరియాని ఆకు - 1, ఉల్లిపాయ - 1 (సన్నగా ముక్కలు తరగాలి), మటన్‌ - కిలో (లెగ్‌ పీస్‌),

కశ్మీరీ రోగన్‌ జోష్‌

కావలసిన పదార్థాలు: నూనె - 5 టే.స్పూన్లు, యాలకులు - 5, లవంగాలు - 4, దాల్చిన చెక్క - చిన్న ముక్క, బిరియాని ఆకు - 1, ఉల్లిపాయ - 1 (సన్నగా ముక్కలు తరగాలి), మటన్‌ - కిలో (లెగ్‌ పీస్‌), వెల్లుల్లి - 6 అల్లం ముక్క - ఒక అంగుళం (సన్నగా తరగాలి), జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు, కారం - ఒకటిన్నర టీస్పూను, గరంమసాలా - ఒకటిన్నర టీస్పూను, టమాటాలు - 2 (ముద్ద చేసుకోవాలి), పెరుగు - 3 టే.స్పూన్లు, కొత్తిమీర - గుప్పెడు, మెంతిపొడి - పావు టీస్పూను.
 
తయారీ విధానం: బాండీలో నూనె వేడిచేసి యాలకులు, దాల్చిన చెక్క, బిరియాని ఆకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకూ వేయించి అల్లం వెల్లుల్లి వేసి తిప్పాలి. అలా 30 నిమిషాలు ఉడకబెట్టి ఉప్పు, కారం, మెంతి పొడి, గరం మసాలా వేసి కలపాలి. చివర్లో టమాటో గుజ్జు వేసి కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికాక కొత్తిమీర చల్లి దించేయాలి.

Updated Date - 2016-07-16T17:53:48+05:30 IST