మీన్‌ వరుతరాచ

ABN , First Publish Date - 2015-09-26T16:43:38+05:30 IST

కావలసిన పదార్థాలు: ఫిష్‌ - 500 గ్రా గ్రైండింగ్‌ కోసం: పచ్చి కొబ్బరి - 1 కప్పు,

మీన్‌ వరుతరాచ

కావలసిన పదార్థాలు: ఫిష్‌ - 500 గ్రా
గ్రైండింగ్‌ కోసం: పచ్చి కొబ్బరి - 1 కప్పు, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి - 1 టీస్పూను, కారం - 1 టే.స్పూను, ధనియాల పొడి - 1 టే.స్పూను, మిరియాల పొడి - 1 టీస్పూను, మెంతులు - 1 టీస్పూను, కరివేపాకు - 2 రెమ్మలు
గ్రేవీ కోసం: అల్లం తురుము - 1 టీస్పూను, వెల్లుల్లి- అర టీస్పూను, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు - 2, పసుపు - 1 టీస్పూను
కోకుం - 3 (ఎండిపోయి ఉంటే వేడి నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టాలి), టమేటా - 1, కరివేపాకు - 1 రెమ్మ, కొబ్బరి నూనె - ఉప్పు.
తయారీ విధానం: బాండీ వేడిచేసి గ్రైండింగ్‌ కోసం చెప్పిన దినుసులన్నీ (కారం, ధనియాల పొడి, కరివేపాకు) వేయించుకోవాలి. కొబ్బరి రంగు మారాక, కారం, ధనియాల పొడి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించి చల్లారాక నీరు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. అదే బాండీలో నూనె వేడిచేసి అర టే.స్పూను వెల్లుల్లి తరుగు, 1 టీస్పూను అల్లం తరుగు, 6 చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి రంగు మారుతున్నప్పుడు పసుపు వేసి కలపాలి. తర్వాత నూరి పెట్టుకున్న ముద్ద వేసి ఉప్పు, 2 కప్పుల నీరు చేర్చిఉడికించాలి. తర్వాత కోకుం వేసి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చేప ముక్కలు వేయాలి. మసాలా తగిలేలా ముక్కలన్నిటినీ కలిపి మూత ఉంచి ఉడికించాలి. చేపలు సగం ఉడికాక టమాటా ముక్కలు వేయాలి. పూర్తిగా ఉడికాక మంట తీసి 1 టే.స్పూను కొబ్బరి నూనె, కరివేపాకు వేసి కలిపి వడ్డించాలి.

Updated Date - 2015-09-26T16:43:38+05:30 IST