బొప్పాయి జామ్‌

ABN , First Publish Date - 2015-08-29T23:40:29+05:30 IST

కావలసిన పదార్థాలు: బొప్పాయి పండు ముక్కలు - 6 కప్పులు, పంచదార - 1 కప్పు, ఆరెంజ్‌ (కమలా) రసం - 2 టేబుల్‌ స్పూన్లు

బొప్పాయి జామ్‌

కావలసిన పదార్థాలు: బొప్పాయి పండు ముక్కలు - 6 కప్పులు, పంచదార - 1 కప్పు, ఆరెంజ్‌ (కమలా) రసం - 2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలు వేసి మూత పెట్టి (జున్ను తయారీలా) కుక్కర్లో ఉడికించాలి. తర్వాత బాగా మెదిపి పంచదార, నిమ్మరసం, ఆరెంజ్‌ రసం కలిపి లేత పాకం రాగానే దించేయాలి. చల్లబడ్డాక గాజు సీసాలో భద్రపరచి, ఫ్రిజ్‌లో ఉంచాలి. కాల్చిన బ్రెడ్‌ స్లైస్‌లపై రాసుకుని తింటే బాగుంటుంది.

Updated Date - 2015-08-29T23:40:29+05:30 IST