Abn logo

గ్రీన్‌ సోయాబీన్‌ బటూర

కావాల్సిన పదార్థాలు
 
గ్రీన్‌ సోయాబీన్స్‌- 2 కప్పులు (రాత్రి నానబెట్టాలి)
తాజా అల్లం - 3 టేబుల్‌స్పూనులు (సన్న ముక్కలుగా తరగాలి)
వెల్లుల్లి రెబ్బలు- 4-5
బ్లాక్‌పెప్పర్‌ కార్న్స్‌- 2 టేబుల్‌స్పూన్లు
జీలకర్ర- 2 టేబుల్‌స్పూన్లు
కొత్తిమీర ఆకులు-1/2 కప్పు (సన్నగా తరిగి)
పచ్చిమిరపకాయలు, ఉప్పు- రుచికి తగినంత
బాగా నానబెట్టిన గోధుమపిండి ముద్ద- 2 కేజీలు
నెయ్యి- భతూరాలు వేగించడానికి సరిపడా

తయారీ విధానం
 
నానబెట్టిన ఆకుపచ్చ సోయా బీన్స్‌, ఇతర పదార్థాలను కలిపి గ్రైండర్‌లో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీరను వేసి బాగా కలపాలి. ఈ పేస్టు పలచగా అవకుండా చూసుకోవాలి. తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుని ఒకొక్క భతూరా 60 గ్రాములు ఉండేలా ఉండలు చేసి పెట్టుకోవాలి. అలా విడిగా చేసిపెట్టుకున్న పిండిముద్దల్ని కప్పుల్లా చేసి వాటిల్లో ఒక్కొక్క టేబుల్‌స్పూను సోయాబీన్‌ పేస్టును పెట్టి వాటి పైభాగంలో ఉన్న పిండిని దగ్గరకు చేర్చి ఆ ఉండల్ని క్లోజ్‌ చేయాలి. కూరతో ఉన్న గోధుమ పిండిముద్దల్ని గారెల్లా చదునుగా వత్తి వాటిని పిండిలో దొర్లించి బాగా కాగిన నెయ్యి లేదా నూనెలో వేసి వేగించాలి. ఇలా తయారు చేసిన వేడి వేడి భతూరాలను చట్నీ లేదా రైతాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

కాకో ఆలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు పూజలుపలు గ్రామాలలో లాక్‌డౌన్‌పాలకులకు పట్టని రిమ్స్‌ సమస్యలు లాల్‌గడలో తాగునీటి తండ్లాటకన్నకూతురిపై అఘాయిత్యంఅగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలిభైంసా ఏరియా ఆసుపత్రిని కొవిడ్‌ కేంద్రంగా మార్చాలిమహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలుపసికందు పొదలపాలైంది! కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Advertisement
Advertisement