చిలగడదుంప పొంగడాలు

ABN , First Publish Date - 2016-02-14T16:51:54+05:30 IST

కావలసిన పదార్థాలు: చిలకడ దుంపలు - రెండు, మొక్కజొన్న పిండి - అర కప్పు, బియ్యం పిండి - అర కప్పు, కోడి గుడ్డు - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు -

చిలగడదుంప పొంగడాలు

కావలసిన పదార్థాలు: చిలకడ దుంపలు - రెండు, మొక్కజొన్న పిండి - అర కప్పు, బియ్యం పిండి - అర కప్పు, కోడి గుడ్డు - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా చిలకడ దుంపల్ని ఉడికించుకుని చల్లారిన తర్వాత తొక్కతీసి మెత్తగా చిదుముకోవాలి. ఇందులో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, గిలకొట్టిన గుడ్డు సొన వేసి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా దోసెలపిండి మాదిరిగా జారుగా కలుపుకోవాలి. పొయ్యిమీద పొంగడాల పెనం పెట్టి గుంటలో ఒక టీ స్పూను నూనె పోసి అందులో ఈ దుంప పిండి కొద్దిగా వెలితిగా పోయాలి. ఒక వైపు వేగాక స్పూనుతో తిరగేసి రెండోవైపు కూడా ఎర్రగా వేగాక దించేయాలి. వేడి వేడి దుంప పొంగడాలు తయారయినట్టే.

Updated Date - 2016-02-14T16:51:54+05:30 IST