పుదీనా పప్పు

ABN , First Publish Date - 2018-08-19T18:18:35+05:30 IST

పెసరపప్పు : అరకప్పు, ఉల్లిపాయ : ఒకటి చిన్నది, పుదీనా : ముప్పావు కప్పు, నిమ్మరసం : ఒకటిన్నర స్పూన్, ఆవాలు : స్పూన్, మినపప్పు..

పుదీనా పప్పు

కావలసిన పదార్థాలు
 
పెసరపప్పు : అరకప్పు, ఉల్లిపాయ : ఒకటి చిన్నది, పుదీనా : ముప్పావు కప్పు, నిమ్మరసం : ఒకటిన్నర స్పూన్, ఆవాలు : స్పూన్, మినపప్పు : అరచెంచా, ఇంగువ : చిటికెడు, కారం : అరచెంచా, పసుపు : పావు చెంచా
 
తయారీ విధానం
 
పెసరపప్పును మెత్తగా ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక ఇంగువా, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కూడా వేగాక పసుపు, పుదీనా ఆకులు వేసి మంట తగ్గించాలి. పుదీనా ఆకులు ఉడికిన తర్వాత ఉప్పు, కారం, ఉడికించి పెట్టుకు న్న పెసరపప్పు వేసి కలపాలి. కొద్దిసేపు తర్వాత నిమ్మరసం కలిపి దించేయాలి. దీంతో పుదీనా పప్పు సిద్ధం.

Updated Date - 2018-08-19T18:18:35+05:30 IST