కాలీఫ్లవర్‌, బంగాళాదుంపల కర్రీ

ABN , First Publish Date - 2015-10-14T14:38:44+05:30 IST

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌: చిన్నది(పువ్వులు విడదీసి పెట్టుకోవాలి), బంగాళాదుంపలు: రెండు

కాలీఫ్లవర్‌, బంగాళాదుంపల కర్రీ

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌: చిన్నది(పువ్వులు విడదీసి పెట్టుకోవాలి), బంగాళాదుంపలు: రెండు పెద్దవి, నూనె: మూడు లేదా నాలుగు టేబుల్‌ స్పూన్లు, మినపప్పు: టేబుల్‌ స్పూను, కొత్తిమీర:రెండు స్పూన్లు, మెంతులు: అర టీస్పూను, ఆవాలు: అర టీస్పూను, ఎండు మిరపకాయలు: మూడులేదా నాలుగు, కొబ్బరి పొడి: అరకప్పు, ఇంగువ: చిటికెడు, కరివేపాకు:కొద్దిగా, ఉల్లిపాయ: మీడియం సైజుది(ముక్కలుగా చేసుకోవాలి), చింతపండు గుజ్జు: టేబుల్‌ స్పూను, పసుపు:చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడ,ఽ దనియాలు: టేబల్‌ స్పూను
తయారీవిధానం: బాండీ లేదా మందపాటి గిన్నెలో కొద్దిగా నూనెవేసి ఎండు మిరపకాయలు, ధనియాలు, మెంతులు వేసుకొని దోరగా వేయించుకుని అనంతరం దీనికి కొబ్బరి పొడి జతచేసి మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. బంగాళాదుంపలు ముక్కలుగా చేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మరికొద్దిగా నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకున్న తరువాత ఉడికించిపెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి కొద్దిగానీరు, చింతపండుగుజ్జు వేసి ఉడికించాలి. ముక్కలు బాగా వేగిన తరువాత మసాలా పొడి, కొత్తిమీర ఆకులువేసుకొని దింపేయాలి.

Updated Date - 2015-10-14T14:38:44+05:30 IST