పచ్చి బఠాణి పూరి

ABN , First Publish Date - 2015-09-04T21:52:58+05:30 IST

కావలసినవి: రెండు కప్పుల బఠాణీలు, ఒక టేబుల్‌ స్పూన్‌ సోంపు, పావు టేబుల్‌ స్పూను ఉల్లివిత్తనాలు,అర స్పూను పంచదార

పచ్చి బఠాణి పూరి

కావలసినవి: రెండు కప్పుల బఠాణీలు, ఒక టేబుల్‌ స్పూన్‌ సోంపు, పావు టేబుల్‌ స్పూను ఉల్లివిత్తనాలు,అర స్పూను పంచదార,మూడు చిటికెల మిరియాల పొడి, ఒక టేబుల్‌ స్పూను నెయ్యి లేదా నూనె వేగించడానికి, ఉప్పు రుచికి తగినంత.
పూరీల కోసం: 500 గ్రాముల మైదా పిండి,మూడు టేబుల్‌ స్పూనుల నెయ్యి, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బఠాణీలను పలుకుగా రుబ్బి ఉంచుకోవాలి. నెయ్యిని వేడి చేసి దానిలో సోంపు, ఉల్లివిత్తనాలు,నూరి ఉంచుకున్న బఠాణీలను వేయాలి. దానికి మిగిలిన మసాలాలను కూడా వేసి సన్నని సెగ మీద ఐదారు నిముషాలు ఉడికించాలి. తరువాత దించి పక్కకు పెట్టుకోవాలి.
మైదాలో ఉప్పు ,నెయ్యి వేసి నీటితో తడిపి ముద్దగా కలిపి ఉంచుకోవాలి. ఈ మైదా ముద్దని 15 నుంచి 16 భాగాలుగా చేసి ఉండలు చేసి ఉంచుకోవాలి. ఒక్కొక్క ముద్దని అరచేతిలో తీసుకుని పల్చగా వత్తుకోవాలి. తరువాత కొంచెం బాఠాణీల మిశ్రమాన్ని తీసుకుని పూరీ మధ్యలో పెట్టి దానిని మళ్లీ గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న వాటిని పూరీలా పల్చగా వత్తుకోవాలి.
మూకుడులో నూనె వేసి బాగా కాగిన తరువాత ఒక్కొక్కటిగా పూరీలను వేయించుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చిన తరువాత ఈ పూరీలను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-04T21:52:58+05:30 IST