ఆలూ పెసర పప్పు

ABN , First Publish Date - 2016-01-18T18:37:03+05:30 IST

కావలసిన పదార్థాలు: పెసరపప్పు(ఉడికించిన)- ఒక కప్పు, బంగాళాదుంపలు(ఉడికించిన)- రెండు, టొమాటో(తరిగి)- మూడు, పచ్చిమిర్చి(తరిగి)- ఐదు, సన్నగా తరిగిన అల్లం-

ఆలూ పెసర పప్పు

కావలసిన పదార్థాలు: పెసరపప్పు(ఉడికించిన)- ఒక కప్పు, బంగాళాదుంపలు(ఉడికించిన)- రెండు, టొమాటో(తరిగి)- మూడు, పచ్చిమిర్చి(తరిగి)- ఐదు, సన్నగా తరిగిన అల్లం- ఒకటీస్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- ఒక టేబుల్‌స్పూను, నీళ్లు- ఒక కప్పు, ఆవాలు, జీలకర్ర- ఒక్కో టీస్పూను చొప్పున, మెంతులు, పసుపు, నూనె లేదా నెయ్యి- అర టీస్పూను చొప్పొన, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: ఒక పాన్‌లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు వేసి వేగించాలి. రెండు నిమిషాల తరువాత దానిలో టొమాటో, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి నూనె పాన్‌ అంచుకు అంటే వరకు మగ్గనివ్వాలి. అవి వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పెసరపప్పు వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఒకవేళ పప్పులో నీళ్లు సరిపోకపోతే అప్పుడప్పుడు పోస్తుండాలి. అంతే ఆలూ పెసర పప్పు రెడీ... దీన్ని పూరీల్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2016-01-18T18:37:03+05:30 IST