చిక్కుడు కొబ్బరి కూర

ABN , First Publish Date - 2015-11-01T15:13:21+05:30 IST

కావలసిన పదార్థాలు: చిక్కుడు కాయలు:పావుకిలో(ముక్కలు చేసుకోవాలి), పచ్చికొబ్బరి: పావుకప్పు,

చిక్కుడు కొబ్బరి కూర

కావలసిన పదార్థాలు: చిక్కుడు కాయలు:పావుకిలో(ముక్కలు చేసుకోవాలి), పచ్చికొబ్బరి: పావుకప్పు, పచ్చిమిరపకాయలు: నాలుగు లేక ఐదు, ఉల్లిపాయ: పెద్దది (ముక్కలుచేసుకోవాలి), వెల్లుల్లిరెబ్బలు: మూడు లేక నాలుగు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర: చెరో టేబుల్‌ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: కొద్దిగా
తయారీ విధానం: ముందుగా చిక్కుడు కాయల్ని ఉడికించి నీరంతా వంచేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, వెల్ల్లుల్లి, పచ్చిమిరపకాయలు కలిపి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం రుబ్బి పెట్టుకున్న ముద్ద వేసి నీరంతా ఇంకిపోయే వరకూ వేయించుకుని, అనంతరం చిక్కుడుకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం వేసి మరికొంత సేపు ఉడికించి దింపేయాలి.

Updated Date - 2015-11-01T15:13:21+05:30 IST