పాలకూర బొబ్బర్ల వడలు

ABN , First Publish Date - 2015-09-04T21:36:24+05:30 IST

కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - ఒకటింబావు కప్పు, పాలకూర తరుగు - 1 కప్పు, ఉల్లి తరుగు

పాలకూర బొబ్బర్ల వడలు

కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - ఒకటింబావు కప్పు, పాలకూర తరుగు - 1 కప్పు, ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు, జీలకర్ర - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: బొబ్బర్లను 8 గంటలపాటు నానబెట్టి నీరు వడకట్టాలి. తర్వాత 1 టేబుల్‌ స్పూను నీటిని (మాత్రమే) జతచేసి జారుగా కాకుండా ముద్దలా రుబ్బుకోవాలి. ఒక వెడల్పాటి బేసిన్‌లో రుబ్బిన పిండి, పాలకూర తరుగు, అల్లం, మిర్చి, ఉల్లి, కొత్తిమీర తరుగు, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలి. తర్వాత నిమ్మకాయ సైజులో ఉండలు తీసుకొని అరిటాకుపై వత్తుకొని నూనెలో దోరగా వేగించాలి. వీటికి టమోటా సాస్‌ మంచి కాంబినేషన్‌.

Updated Date - 2015-09-04T21:36:24+05:30 IST