టమోటా స్వీట్‌

ABN , First Publish Date - 2015-08-30T22:20:17+05:30 IST

కావలసిన పదార్థాలు: టమోటాలు - 3, పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - 1 టీ స్పూను, నేతిలో వేగించిన జీడిపప్పులు, ఎండు ద్రాక్ష - 10 చొప్పున,

టమోటా స్వీట్‌

కావలసిన పదార్థాలు: టమోటాలు - 3, పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - 1 టీ స్పూను, నేతిలో వేగించిన జీడిపప్పులు, ఎండు ద్రాక్ష - 10 చొప్పున, దాల్చినచెక్క పొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: టమోటాలను వేడి నీటిలో 3 నిమిషాలు ఉడికించి చల్లారిన తర్వాత తొక్క తీసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి. ఆ తర్వాత కడాయిలో టమోటా గుజ్జు, పంచదార కలిపి చిన్నమంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దించెయ్యాలి. చల్లారిన తర్వాత ఉత్తిగా తిన్నా, బ్రెడ్‌, చపాతీలతో నంజుకుని తిన్నా బాగుంటుంది.

Updated Date - 2015-08-30T22:20:17+05:30 IST