మెంతి శనగపిండి కూర

ABN , First Publish Date - 2015-09-03T18:37:09+05:30 IST

కావలసిన పదార్థాలు: శనగపిండి - ముప్పావు కప్పు, ఉల్లి కాడలు - 10, మెంతి ఆకులు - 1 కప్పు

మెంతి శనగపిండి కూర

కావలసిన పదార్థాలు: శనగపిండి - ముప్పావు కప్పు, ఉల్లి కాడలు - 10, మెంతి ఆకులు - 1 కప్పు, ఉల్లితరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 3, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు, ఇంగువ, అల్లం, వెల్లుల్లి తరుగు, కరివేపాకు - తిరగమోతకి సరిపడా.
తయారుచేసే విధానం: శనగపిండి చిన్న మంటపై దోరగా వేగించి పక్కనుంచాలి. నూనెలో ఆవాలు, ఇంగువ, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. తర్వాత మెంతి, ఉల్లికాడల తరుగు వేసి పచ్చివాసన పోయేవరకు వేగించి శనగపిండి కలపాలి. శనగపిండి అడుగంటకుండా చిన్నమంటపై ఉంచి అట్లకాడతో కలుపుతూ ఉండాలి. ఈ కూర అన్నంతో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-03T18:37:09+05:30 IST